కావల్సినవి: మటన్ (ఎముకల్లేనిది) - 800 గ్రా, నూనె - ముప్పావుకప్పు, టొమాటోలు - ఐదు (పేస్టులా చేసుకోవాలి), అల్లంవెల్లుల్లి పేస్టు - మూడు చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు - పదిహేను, పచ్చిమిర్చి ముక్కలు - రెండు చెంచాలు, దాల్చినచెక్క - ఒకటి, లవంగాలు యాలకులు - ఐదారు చొప్పున, కారం - రెండు చెంచాలు, ధనియాల పొడి - రెండు చెంచాలు, పసుపు - చెంచా, కరివేపాకు రెబ్బలు - మూడు, మెంతికూర కట్ట - సగం (వేయించి పొడి చేసుకోవాలి), ఆవ ఆకులు - ఐదు ( వేయించి పొడి చేసుకోవాలి), జీలకర్ర - రెండు చెంచాలు (వేయించి పొడి చేసుకోవాలి), ఉప్పు-తగినంత.
తయారీ: బాణలిలో చెంచా నూనె వేడిచేసి దాల్చినచెక్కా, యాలకులూ, లవంగాలూ వేయించుకోవాలి. నిమిషం తరవాత అందులో పచ్చిమిర్చి ముక్కలూ, టొమాటో గుజ్జూ, కొద్దిగా ఉప్పూ వేసి మంట తగ్గించాలి. టొమాటో గుజ్జులోని పచ్చివాసన పోయాక అల్లంవెల్లుల్లి పేస్టూ, పసుపూ, కారం, మరికొంచెం ఉప్పూ, ధనియాలపొడీ, వేయించిన మెంతికూర పొడీ, ఆవ ఆకులపొడీ, జీలకర్రపొడీ వేసుకుని బాగా కలిపి దింపేయాలి. నిమిషం తరవాత ఈ మిశ్రమంలో మటన్‌ముక్కలు వేసి వాటికి అవన్నీ పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని బాణలిలో తీసుకుని రెండు చెంచాలు తప్ప మిగిలిన నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. అరగంటకు మటన్ ముక్కలు మెత్తగా అవుతాయి. అప్పుడు దింపేయాలి. మిగిలిన రెండు చెంచాల నూనెను వేడిచేసి వెల్లుల్లిరెబ్బలూ, కరివేపాకూ వేయించి మటన్ ముక్కలపై వేసేయాలి. అంతే వూరగాయ మాంసం సిద్ధం.